చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చనా ఆనంద్ మాట్లాడుతూ..
చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చనా ఆనంద్ మాట్లాడుతూ.. అనతి కాలంలోనే దక్షిణాసియాలో అగ్రగామి స్ట్రీమింగ్ వేదికగా ఎదిగిన తమకు అమెరికాలో ఈ ఏడాది అత్యంత కీలకమన్నారు. తక్కువ సమయంలోనే తాము విజయవంతం కావడం వెనుక వినియోగదారుల ప్రేమాభిమానాలు ఉన్నట్లు చెప్పారు. తమ కృతజ్ఞతను చాటేందుకు ఇప్పుడు బహుళ కార్యక్రమాల ద్వారా వినియోగదారులకు ఉల్లాసపరచాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ప్రారంభించిన ZEE5 యాడ్-ఆన్ల ద్వారా ఇప్పుడు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు తమకు ఇష్టమైన దక్షిణ ఆసియా కంటెంట్‌ను సబ్స్క్రయిబ్ చేసుకోవడం, యాక్సిస్ చేసుకోవడం సులభమైందన్నారు. మరో దిగ్గజ దక్షిణాసియా బ్రాండ్ క్విక్లీ భాగస్వామ్యంతో ప్రతి సబ్‌స్క్రిప్షన్‌తో పాటు గ్యారంటీతో కూడిన రివార్డులను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. అలాగే, ఈ నూతన సంవత్సరంలో హవాయి వెకేషన్స్‌తో పాటు ఇతర విలువైన బహుమతులను అందించడం ద్వారా ఈ హాలిడే సీజన్‌ను వినియోగదారులకు జీ5 గ్లోబల్‌తో జర్నీ మరింత మధుర జ్ఞాపకంగా మిగిల్చాలనుకుంటున్నట్లు అర్చనా ఆనంద్ తెలిపారు. అలాగే, గివ్బ్యాక్ క్యాంపెయిన్ భాగస్వామ్య సంస్థ క్విక్లీ సీవోవో ప్రితేశ్ వెలంకర్ మాట్లాడుతూ.. తమ వినియోగదారులకు ప్రత్యేకమైన వినోదాన్ని అందించేందుకు జీ5 గ్లోబల్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ సంయుక్త భాగస్వామ్యంలో ప్రజలకు ఇంటి వద్దే ఇష్టమైన వినోదం, రుచులు, ఫ్యాషన్‌ను ఆస్వాదింపజేయడంలో ఈ క్యాంపెయిన్‌ను ఆరంభంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. జీ5 గ్లోబల్ యాడ్ ఆన్స్ ఆండ్రాయిడ్, ఐవోఎస్, www.zee5.com, ఫైర్ టీవీ, యాపిల్ టీవీ, రోకు, సామ్సంగ్ టీవీల్లో అందుబాటులో ఉన్నాయి.